మహేష్ బాబు కోసం ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ సినిమా?

Eight Hundred Crore Budget Film for Mahesh Babu
x

మహేష్ బాబు కోసం ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ సినిమా? 

Highlights

మహేష్ బాబు కోసం ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ సినిమా?

Mahesh Babu Movie Budget: ఈ మధ్య కాలంలో స్టార్ హీరో నాని గారు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు తీయడంలో ముందుంటున్నారు. మినిమం 100 కోట్లు బడ్జెట్ లేనిదే సినిమాలు కూడా చేయటం లేదు. మరోవైపు రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ మత్రం ఒక్కో సినిమాకి బడ్జెట్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా విడుదలైన "అర్ఆర్ఆర్" సినిమా కి రాజమౌళి దాదాపు 500 కోట్ల దాకా ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే.

రాజమౌళి కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా అవి కచ్చితంగా తిరిగి వస్తాయన్న నమ్మకంతోనే నిర్మాతలు ఎన్ని కోట్లు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి తన తదుపరి సినిమా కోసం ఏకంగా ఎనిమిది వందల కోట్లు బడ్జెట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది."అర్ఆర్ఆర్" ఈ సినిమాతో తన బాహుబలిటు రికార్డులను బద్దలు కొడుతున్న రాజమౌళి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథను అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జేమ్స్ బాండ్ వంటి పాత్రలో మహేష్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నారని, ఇక హాలీవుడ్ ని తలపించిన లాగా స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భారతీయ భాషల్లో మాత్రమే కాక ఈ సినిమాని ఇంగ్లీష్ వర్షన్ లో కూడా విడుదల చేస్తే బడ్జెట్ ఎనిమిది వందల కోట్లను రాబట్టుకోవడం సులువు అవుతుందని రాజమౌళి భావిస్తున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories