సంక్రాంతికే ' ఈ అమ్మాయి( EMI )' వచ్చేది !

సంక్రాంతికే  ఈ అమ్మాయి( EMI ) వచ్చేది !
x

ఈ అమ్మాయి మూవీ

Highlights

దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ.. బిగ్ బాస్-2, ఏడు చేప‌ల క‌థ చిత్రం ఫేమ్ భానుశ్రీ ముఖ్యపాత్ర‌లో నటిస్తున్న సినిమా " ఈ అమ్మాయి(EMI )" . ఈ చిత్రం...

దొంతు ర‌మేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మౌతూ.. బిగ్ బాస్-2, ఏడు చేప‌ల క‌థ చిత్రం ఫేమ్ భానుశ్రీ ముఖ్యపాత్ర‌లో నటిస్తున్న సినిమా " ఈ అమ్మాయి(EMI )" . ఈ చిత్రం సంక్రాంతి రోజున విడుదల చేయనున్నట్లు దర్శకుడు రమేష్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై దొంతు బుచ్చ‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు దొంతు ర‌మేష్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం కారణంగా విడుదల వాయుదాపడిందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.విధ ద‌శ‌ల్లో అమ్మాయిలు ఎదుర్కోనే ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్ని క‌థాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపోందించామన్నారు. ఈ సినిమా ను ఎక్క‌డ కాంప్రమైజ్ కాకుండా రూపోందించినట్లు చెప్పారు. శ్రీ అవ‌ధూత వెంక‌య్య స్వామి ప్రోడ‌క్ష‌న్స్ పై దొతు బుచ్చయ్య, సంగీత నిర్మించారు. రవిశంకర్ బాణీలు సమకూర్చారు. ఈ చిత్రంలో లబ్బ లబ్బ అనే లిరికల్ సాంగ్ ఈ నెల 25న విడుదల చేశారు. లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ అందించారు. ధనరాజ్ , చందన, మహేశ్ కీలక పాత్రలు పోషించారు.
Show Full Article
Print Article
Next Story
More Stories