logo
సినిమా

'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ గుట్టు విప్పిన దానయ్య

ఆర్ఆర్ఆర్ బడ్జెట్ గుట్టు విప్పిన దానయ్య
X
Highlights

నిజానికి నిర్మాతలు ఒక సినిమాకు ఎంత బడ్జెట్ వెచ్చిస్తున్నారు అనే దానిపై ఎక్కువ మాట్లాడరు. కానీ 'ఆర్ఆర్ఆర్' వంటి ...

నిజానికి నిర్మాతలు ఒక సినిమాకు ఎంత బడ్జెట్ వెచ్చిస్తున్నారు అనే దానిపై ఎక్కువ మాట్లాడరు. కానీ 'ఆర్ఆర్ఆర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి దానయ్య మాత్రం వారు సినిమా కోసం 350 నుంచి 400 కోట్లు దాకా బడ్జెట్ ల్ ఇస్తున్నామని తెలిపారు. ఈ సినిమాను తెలుగుకు మాత్రమే పరిమితం చేయకుండా తమిళం, హిందీ, కన్నడ మలయాళం ఇలా మొత్తం పది భారతీయ భాషల్లో అనువదించనున్నామని అన్నారు దానయ్య. మరి మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో ఆశిస్తున్నారు అని అడుగగా అలా అవి ఇప్పుడే ఎలా చెప్తాం పూర్తయ్యాక మాత్రమే చెప్పగలం అని అన్నారు.

నిజానికి ఇంత భారీ బడ్జెట్ సినిమా తెలుగులో ఏదీ రాలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన '2.O' కూడా ఇంతే భారీ బడ్జెట్తో నిర్మించారు కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కాని 'ఆర్ ఆర్ ఆర్' కు దానికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో సినిమాని డిమాండ్ ఓ రేంజ్ లో ఉంది. అందుకని ఇప్పటికిప్పుడు సినిమాని అమ్మేసినా సరే బడ్జెట్ కు రెండింతలు లేదా మూడింతలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే దానయ్య బడ్జెట్ గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

Next Story