DVV Danayya: అందుకే ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనలేదు.. రాజమౌళి అలాంటి వ్యక్తి కాదు..

DVV Danayya Gives Clarity On Rumours
x

DVV Danayya: "అందుకే ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనలేదు.. రాజమౌళి అలాంటి వ్యక్తి కాదు.." అంటున్న దానయ్య

Highlights

DVV Danayya: "ఆర్ ఆర్ ఆర్" పుకార్లపై ఎట్టకేలకు రియాక్ట్ అయిన దానయ్య

DVV Danayya: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమా నుంచి "నాటు నాటు" పాట ఏకంగా ఆస్కార్ కూడా అందుకుని తెలుగు సినిమా పేరు ప్రతిష్టాలను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. ఆ పాటకి సంగీతాన్ని అందించిన కీరవాణి మరియు లిరిక్స్ అందించిన చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. చిత్ర డైరెక్టర్ రాజమౌళి మరియు సినిమాలో హీరోలుగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో కనిపించారు. కానీ సినిమాని నిర్మించిన డివివి దానయ్య మాత్రం ఎక్కడా కనిపించలేదు.

అసలు సినిమా ఆస్కార్ నామినేషన్ల గురించి వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి డివివి దానయ్య పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు. ఆస్కార్ ప్రమోషన్ల కోసం దానయ్య 80 కోట్లు ఇవ్వలేదని రాజమౌళి దానయ్యను పక్కన పెట్టేసారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా కోసం కొంత పెట్టుబడి పెట్టారని వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిర్మాత దానయ్య దీని గురించి రియాక్ట్ అయ్యారు. రాజమౌళి ఎప్పుడు తన నిర్మాతలకి చాలా గౌరవం ఇస్తారని అలా అవాయిడ్ చేసే వ్యక్తిత్వం తనది కాదని అని అన్నారు దానయ్య. "నాకు ఇష్టం లేదు కాబట్టే ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్ళలేదు. నాకు హంగులు ఆర్భాటాలు నచ్చవు," అని అన్నారు దానయ్య.

ఇక సినిమాలో చిరంజీవి పెట్టుబడులు పెట్టారనే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఒకవేళ పెట్టాలనుకున్నా తన కొడుకు రామ్ చరణ్ కి పెడతారు కానీ తనకి ఎందుకు పెడతారు అని ప్రశ్నించారు. "నా పెట్టుబడి మొత్తం నా ఫైనాన్షియర్లు ఇస్తారు. నేను కొంత పెట్టుబడి పెడతాను మిగతాది వారి వద్ద వడ్డీకి తీసుకొస్తాను. ఈ వార్తలు రాసిన వాడిని నా దగ్గరికి తీసుకురండి. వాడేమైనా నా టేబుల్ దగ్గరికి వచ్చి చూశాడా లేదా నా బ్యాంక్ అకౌంట్లు చూస్తాడా. చిరంజీవి సినిమా తీయాలనుకుంటే తన సొంత బ్యానర్ లోకి తీస్తారు కదా," అని అన్నారు దానయ్య.

Show Full Article
Print Article
Next Story
More Stories