
Anju Krishna: డ్రగ్స్‌తో రెడ్ హ్యెండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్
Anju Krishna: తమిళ సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాలు యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ఆపరేషన్‌తో వెలుగులోకి వచ్చాయి.
Anju Krishna: తమిళ సినీ పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాలు యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన ఆపరేషన్‌తో వెలుగులోకి వచ్చాయి. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టును రట్టు చేసిన పోలీసులు, చెన్నై వలసరవాక్కం ప్రాంతంలో మెరుపు దాడులు నిర్వహించి కోలీవుడ్ నటి అంజు కృష్ణతో పాటు కో-డైరెక్టర్ విన్సీ నివేతను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
రహస్య సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న అనుమానంతో చేపట్టిన ఈ దాడుల్లో నటి అంజు కృష్ణ, దర్శకురాలు విన్సీ నివేత సహా మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో కార్తిక్ రాజు, యశ్వంత్, శ్రీరామ్ వంటి పలువురు యువకులు కూడా ఉన్నారు. వీరి వద్ద నుండి భారీగా మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల వద్ద పోలీసులు జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరి నుండి..6 గ్రాముల అత్యంత ప్రమాదకరమైన మెతాంఫేటమైన్ (మెత్),7 గ్రాముల ఖరీదైన ఓజీ గంజాయి,ఎల్ఎస్ డీ స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్,9 మొబైల్ ఫోన్లు మరియు ఒక ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ కేవలం చెన్నైకే పరిమితమా? లేక ఇతర సినీ ప్రముఖులతోనూ సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో వరుసగా వెలుగు చూస్తున్న ఇలాంటి ఘటనలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




