Movie News: బాలయ్యకు లేని అవసరం మెగాస్టార్ కే ఎందుకొస్తోంది?

Movie News: ఒక దశాబ్దం పాటు రాజకీయాలలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే మళ్లీ సినిమాల్లోకి రియంట్రి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 24 Sept 2022 9:30 PM IST
Movie News: బాలయ్యకు లేని అవసరం మెగాస్టార్ కే ఎందుకొస్తోంది?
X

Movie News: బాలయ్యకు లేని అవసరం మెగాస్టార్ కే ఎందుకొస్తోంది?

Movie News: ఒక దశాబ్దం పాటు రాజకీయాలలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే మళ్లీ సినిమాల్లోకి రియంట్రి ఇచ్చిన సంగతి తెలిసిందే. "ఖైదీ నెంబర్ 150" సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి ఆ తరువాత "సైరా నరసింహారెడ్డి" సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, కన్నడ స్టార్ సుదీప్, మరియు తమిళ స్టార్ విజయ్ సేతుపతి కిలక పాత్రలలో కనిపించారు.

ఆ తర్వాత చిరంజీవి నటించిన "ఆచార్య" సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్ర పోషించారు. మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కామియో పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ మరియు నాగార్జున కూడా ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ ఇద్దరు సమకాలీకులే. ఇద్దరికీ టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఒకవైపు బాలకృష్ణ మాత్రం సోలో హీరో గానే నటిస్తూ "అఖండ" వంటి మంచి బ్లాక్ బస్టర్లు అందిస్తుంటే మరోవైపు చిరంజీవి మాత్రం కేవలం స్టార్ నటులతోనే తన సినిమాలకి బజ్ ను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకి లేని అవసరం చిరంజీవికి మాత్రమే ఎందుకు వస్తుంది అని అభిమానులు చర్చిస్తున్నారు. చిరంజీవికి ఉన్న ఫాన్ ఫాలోయింగ్ చాలని తన సినిమాల కోసం ప్రత్యేకంగా వేరే స్టార్ నటుల పైన ఆధారపడాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ అభిమానులు వాపోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story