ఇదేం దోచుకోవడం బాబోయ్ .. 'దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత' ట్రైలర్

ఇదేం దోచుకోవడం బాబోయ్ .. దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత ట్రైలర్
x
దోచుకున్నవాళ్లకి దోచుకున్నంత
Highlights

తెలుగు సినీ పరిశ్రమలో నుంచి విడుదలైన చిత్రాలలో భారీ ఎక్స్‌పోజింగ్ ఉన్న సినిమాలకు కత్తెరలు పడుతుంటాయి

తెలుగు సినీ పరిశ్రమలో నుంచి విడుదలైన చిత్రాలలో భారీ ఎక్స్‌పోజింగ్ ఉన్న సినిమాలకు కత్తెరలు పడుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కంటెంట్‌తో వస్తోన్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఒకప్పుడు మలయాళంలో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఇలాంటి సినిమాల వల్ల యువత పెడదారి పడుతోందని సెన్సార్ బోర్డు అడ్డుకట్ట వేసింది. అయినప్పటికీ కొన్ని సీన్స్ కత్తెరలు పడుతూ.. సినిమాలు విడుదల అవుతున్నాయి.

అడల్ట్ కంటెంట్‌తో వస్తోన్న సినిమాల్లో కొత్తవాళ్లే ఉంటారు. నటీనటులు, నిర్మాతలు కూడా కొత్త వారే ఉంటారు. కానీ, సినిమాలకు మాత్రం మంచి పబ్లీసిటీ వస్తోంది. దానికి కారణం అడల్ట్ కంటెంట్. అదే కోవకు చెందిన 'ఏడు చేపల కథ', 'వైఫ్ ఐ' సినిమాలు చూశాం. అయితే, సినిమా విడుదలకు ముందు డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడిన టీజర్, ట్రైలర్లను రిలీజ్ చేస్తారు. దీంతో ఇవి బాగా పాపులర్ అయిపోతాయి. కానీ, ఈ సినిమాలకు విడుదల కావాలంటే సెన్సార్ రాదు. సినిమా విడుదలలో అలాంటి సీన్లన్నీ తీసేయాలి. దీనిని ప్రేక్షకులు గమనించరు. అయితే ఏ వర్గానికి చెందిన వారు దాని ఉంటారు కాబట్టి ఈ సినిమాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదు.

ఈ క్రమంలోనే అడల్ట్ కంటెంట్‌తో తెలుగులో మరో సినిమా వస్తోంది. 'దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత' అనే టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూస్తే.. 'A' సర్టిఫికెట్‌కు మించిన సినిమా అని తెలుస్తోంది. ఈ ట్రైలర్ లోనే శృంగారం మితిమిరింది. మధ్యమధ్యలో ఫైట్లు ఉన్నాయి. డైలాగ్స్ చూస్తే మెసేజ్‌తో కూడిన సినిమాలా అనిపించేలా ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories