Bigg Boss Season 6: బిగ్ బాస్ ఆరవ సీజన్ విజేత ఎవరో తెలుసా?

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అతనేనా?

Jyothi
Updated on: 17 Dec 2022 8:01 PM IST
Do You Know Who is the Winner of Bigg Boss Season Six?
X

Bigg Boss Season 6: బిగ్ బాస్ ఆరవ సీజన్ విజేత ఎవరో తెలుసా?

Bigg Boss Season 6: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆరవ సీజన్ కు మరి కొద్ది గంటల్లో శుభం కార్డు పడబోతోంది. ఇప్పటికే గతవారం శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వడంతో ఆఖరి ఐదుగురు ఇంటి సభ్యులు గ్రాండ్ ఫినాలే కి చేరుకున్నారు. ఒక బిగ్ బాస్ సీజన్ 6 ట్రోఫీని తీసుకునేది ఎవరు అని ఇప్పటికే నెట్టింట్లో లో చర్చ కూడా మొదలైంది. ఇంతకుముందు సీజన్లతో పోలిస్తే సీజన్ 6 కు అంత క్రేజ్ లేదని చెప్పుకోవాలి. మరోవైపు ఈ సీజన్ కు రాజకీయాలకు కూడా సంబంధం పెట్టేస్తున్నారు. టాప్ 2 లో ఉండాల్సిన ఇనాయాను కావాలనే ఎలిమినేట్ చేశారని, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలే రోజు కి ఒకరోజు ముందు శ్రీ సత్య ను ఎలిమినేట్ చేయడం ఏంటి అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇక పొలిటికల్ పవర్ తో రేవంత్ ని విన్నర్ కాకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని నెట్టింట్లో పుకార్లు వస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 కి ఎవరు విజాతగా నిలవనున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. తాజా సమాచారం ప్రకారం రోహిత్ కి తక్కువ ఓట్లు వచ్చి ఆఖరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తికి నాలుగో స్థానం దక్కగా ఆదిరెడ్డి మూడవ స్థానంలో ఉన్నారట. ఇక రేవంత్ మరియు శ్రీహాన్ లలో అత్యధిక ఓట్లు సంపాదించి సింగర్ రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

Jyothi

Jyothi

Next Story