నందమూరి హీరోలతో నటించిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Do You Know Who Is The Only Heroine Who Acted With Balakrishna Ntr And Kalyan Ram
x

నందమూరి హీరోలతో నటించిన హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

Highlights

నందమూరి ముగ్గురు హీరోలతో నటించారు ఓ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌‌గా పరిచయమైన కాజల్ అగర్వాల్.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది నానుడి. ఇది ముఖ్యంగా సినీ హీరోయిన్లకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. ఈ క్రమంలో కొందరు వయసుతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలతో నటించారు. మరికొందరు తండ్రికొడుకులతోనూ నటించారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తండ్రి, కొడుకులతో నటించిన వారూ ఉన్నారు. అయితే నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సరసన నటించిన మెప్పించారు ఓ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ సినిమాలేంటో చూద్దాం.

నందమూరి ముగ్గురు హీరోలతో నటించారు ఓ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో కాదు లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌‌గా పరిచయమైన కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరదలిగా నటించి మెప్పించారు కాజల్. ఆతర్వాత ఎంఎల్‌ఏ అనే సినిమాలో నటించారు. ఇక ఎన్టీఆర్‌తో బృందావనం, టెంపర్ లాంటి సినిమాలు చేశారు. ఇక జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌ కూడా చేశారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే భగవంత్ కేసరి సినిమా కంటే ముందు బాలకృష్ణ, కాజల్ కాంబోలో ఓ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయి ఆ తర్వాత క్యాన్సల్ అయిందని టాక్. పైసా వసూల్ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణకు జోడిగా శ్రేయా నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ అగర్వాల్‌ను తీసుకుందామని అనుకున్నారంట పూరి. అయితే కాజల్‌తో సంప్రదింపులు జరపగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కాంబో సెట్ కాలేదని సమాచారం. ఇక అప్పుడు మీరిద్దరి కాంబో మిస్సైనా.. భగవంత్ కేసరి సినిమాలో ఓకే అయింది. అలా నందమూరి ముగ్గురు హీరోలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories