మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసా?

Do You Know What Pawan Kalyan Is Doing For His Nephew
x

మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసా?

Highlights

* మెగా హీరో కోసం ఐదు రోజులు కేటాయించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరి హర వీర మల్లు" సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సుజీత్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమాని పవన్ కళ్యాణ్ తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో కిలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగతా సినిమాల కంటే ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ మొదటినుంచి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ నెలకి కేవలం ఐదు రోజులు మాత్రమే కేటాయించనున్నారట.

ఒకవైపు తన రాజకీయ పనులను చూసుకుంటూ మరోవైపు ఈ సినిమా షూటింగ్ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయనున్నారట. ఎన్నికలు కూడా దగ్గరకు వస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ కు పనులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేయగలరో లేదో అని ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories