పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..?

Do you know Bellamkonda Sai Sreenivas Next Film is With?
x

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా?

Highlights

Bellamkonda Sai Sreenivas: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర కంటే సినిమాకి స్క్రిప్ట్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎక్కువగా దక్కింది. అయితే తాజాగా ఇప్పుడు సాగర్ కే చంద్ర తన నెక్స్ట్ సినిమా కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సాగర్ కే చంద్ర ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుస డిజాస్టర్లతో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్యనే రాక్షసుడు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ అల్లుడు అదుర్స్ వంటి సినిమాతో మరొక ఫ్లాప్ అందుకున్న సాయి శ్రీనివాస్ తాజాగా ఇప్పుడు ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటైన "ఛత్రపతి" ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సాయి శ్రీనివాస్ ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాలి.

మరోవైపు "స్టువర్టుపురం దొంగ" అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నావా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సినిమాకి సైన్ చేశారట. మరి పవన్ కళ్యాణ్ సినిమాతో దర్శకుడిగా పెద్ద మంచి పేరు తెచ్చుకో లేకపోయినా సాగర్ కే చంద్ర ఈసారైనా డైరెక్టర్ గా హిట్ అందుకుంటారో లేదో వేచి చూడాలి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో నటిస్తున్న సినిమా కాబట్టి అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories