Parugu Movie: బన్నీ పరుగు చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

Do you Know Allu Arjun Parugu Movie Before Title
x

బన్నీ పరుగు చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

Highlights

అల్లు అర్జున్ అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బన్నీ.

Parugu Movie: అల్లు అర్జున్ అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బన్నీ. అయితే అల్లు అర్జున్ హిట్ సినిమాల్లో పరుగు ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్జు అర్జున్‌‌కు జంటగా షీలా నటించారు. 2008లో రిలీజైన పరుగు సినిమా మంచి హిట్ అయింది. ఈ మూవీ దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే పరుగు సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రతి సినిమాకు ముందు చాలానే టైటిల్స్ అనుకుంటారు. అందులో చివరకు కథకు తగ్గట్టు ఓ టైటిల్‌ను సెట్ చేస్తారు. అలాగే పరుగు సినిమాకు కూడా కొన్ని టైటిల్స్ అనుకున్నారు. అందులో ప్రేమికుడు, ఎంతఘాటు ప్రేమయో, అరకు అనే టైటిల్స్ మొదట్లో అనుకున్నారంట. కానీ ఇవన్నీ సెట్ అవ్వలేదని చివరకు వారధి అనే టైటిల్ ఓకే చేద్దామనుకున్నారు. ఆ టైటిల్ రిజిస్టర్ చేయించి అదే టైటిల్‌తో షూటింగ్ కి వెళ్లారు. కానీ సినిమాలో కథ, హీరో క్యారెక్టర్, కొన్ని డైలాగ్స్ వల్ల ఆ సినిమాకు వారధి కంటే పరుగు టైటిల్ బాగుంటుందని భావించి సినిమా షూటింగ్ అయ్యే సమయానికి పరుగు టైటిల్‌ని ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రేమించిన అతనితో వెళ్లిపోయిన కూతురిని వెతకడానికి తండ్రి పడే కష్టం, ఆ సమయంలో తన చిన్న కూతుర్ని హీరో లవ్ చేస్తే ఆ తండ్రి ఎలా రియాక్ట్ అయ్యారు అని మంచి లవ్ అండ్ ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే వారధి అనే టైటిల్‌తో తర్వాత రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. అల్లు అర్జున్ సినిమాకు మొదట వారధి అనుకుని పరుగుగా మార్చారంటూ ఓ వార్త రావడంతో ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినిమాకు పరుగు పెట్టి మంచి పనిచేశారంటే.. మరికొందరు మంచి కథ కాబట్టి దానికి ఏ టైటిల్ పెట్టినా పక్కాగా హిట్ అయ్యేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఆ తర్వాత జులాయి, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, దేశముదురు, ఆర్య, ఆర్య2, హ్యాపీ, బన్నీ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. పుష్ప2 సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గత సినిమాల రికార్డులను బ్రేక్ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. బహుబలి సినిమా రికార్డులను కూడా బద్దలుకొట్టి ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ సినిమాగా నిలిచింది. ఇక త్వరలో త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories