విజేత ఎవరనేది లైవ్‌లో చూడండి : నాగార్జున

bigg boss
x
bigg boss
Highlights

ముఖి, రాహుల్ మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. చివరి క్షణంలో రాహుల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడని సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ హిరో కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నేటితో ముగియనుంది. విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో తెలియనుంది. బిగ్‌బాస్‌లో ఫైనల్లో హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ ఉన్నారు. అయితే శ్రీముఖి, రాహుల్ మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. చివరి క్షణంలో రాహుల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడని సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. శ్రీముఖిపై కొన్ని ఓట్ల మెజారిటీతోనే రాహుల్‌ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ వార్తలను నాగర్జున స్పందించారు. బిగ్‌బాస్‌ ఒక అద్భుతమైన ప్రయాణమని తెలిపారు. ఫైనల్ ఎపిసోడ్ షూట్ కాలేదని, సాయంత్రం 6 గంటలకు లైవ్ ప్రసారం ఉంటుంది అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో విజేత గురించి ప్రచారాలు నమ్మొదని, లైవ్‌లో ఈ కార్యక్రమంలో విజేత ఎవరనేది తెలుసుకోవాలంటూ ఉత్కంఠ ట్వీట్‌ను నాగార్జున పోస్టు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories