"గాడ్ ఫాదర్" సినిమాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని డిస్ట్రిబ్యూటర్లు

"గాడ్ ఫాదర్" సినిమాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని డిస్ట్రిబ్యూటర్లు

Rama Rao
Updated on: 18 Sept 2022 8:30 PM IST
Distributors Did Not show any Interest in the Godfather Movie
X

"గాడ్ ఫాదర్" సినిమాపై ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించని డిస్ట్రిబ్యూటర్లు

Godfather: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు మరియు నిర్మాతలు క్యూ కడుతుంటారు. దాదాపు ఒక దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ "ఖైదీ నెంబర్ 150" సినిమాతో రియల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్న చిరంజీవి ఈ మధ్యనే కొరటాల శివ డైరెక్షన్లో "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను కలిగించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి నెక్స్ట్ సినిమా పై డిస్ట్రిబ్యూటర్లు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సత్యదేవ్, నయనతార మరియు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అక్టోబర్ 5 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. విడుదలకి ఇంకా కొద్ది వారాలు సమయం ఉన్నప్పటికీ ఈ సినిమాని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ సినిమాకి గాను నిర్మాతలు 85 కోట్ల రేషియోని కోరుతున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్లు దీనికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోతే నిర్మాతలే ఈ సినిమాని స్వయంగా విడుదల చేసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

Rama Rao

Rama Rao

Next Story