Ravi Teja: సిద్ధు జొన్నలగడ్డ విలన్ పాత్ర కి సెట్ అవుతారా?

* విలన్ పాత్రలో యువ హీరో సిద్దు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి

R Tripura Malini
Updated on: 14 Nov 2022 8:00 PM IST
Discussions about siddu opp raviteja in an important role
X

సిద్దు జొన్నలగడ్డ విలన్ పాత్ర కి సెట్ అవుతారా?

Maanadu Remake: ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవటం లేదు. ఓటీటీ ల దయవల్ల ఏ భాష సినిమాలైనా కూడా ప్రేక్షకులు సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు మన భాషలోకి రీమేక్ అయ్యాక కథ ఎలాగో తెలుసు కాబట్టి అవి థియేటర్లకు వెళ్లి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా విడుదలైన "గాడ్ ఫాదర్" సినిమా కూడా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గానే తెరకెక్కింది.

కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పుకోవాలి. తాజాగా ఇప్పుడు మరొక సూపర్ హిట్ సినిమా ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. అది శింబు హీరోగా నటించిన సూపర్ హిట్ అయినా "మానాడు". అయితే ఇందులో శింబు పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తుండగా విలన్ పాత్రలో యువ హీరో సిద్దు కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ్ లో ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటించారు. మరి తెలుగులో ఈ పాత్రకి "డీ జే టిల్లు" ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ఎంత వరకు సెట్ అవుతాడా అని అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో విలన్ పాత్రలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారా లేదా అని ఇంకా తెలియాల్సింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం డి జే టిల్లు సీక్వెల్ తో సిద్దు జొన్నలగడ్డ బిజీగా ఉన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story