వెంకటేష్ కోసం కథను సిద్ధం చేయలేకపోతున్న డైరెక్టర్లు

Directors Unable to Prepare the Story for Venkatesh
x

వెంకటేష్ కోసం కథను సిద్ధం చేయలేకపోతున్న డైరెక్టర్లు

Highlights

వెంకటేష్ కోసం కథను సిద్ధం చేయలేకపోతున్న డైరెక్టర్లు

Venkatesh: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు. ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వెంకటేష్ దృశ్యం 2, నారప్ప వంటి సినిమాలను ఓటీటీలో విడుదల చేసి ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమాతో మళ్ళీ థియేటర్లలో కనిపించారు. ఇక మరోవైపు వెంకటేష్ విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటిస్తున్న "ఓరి దేవుడా" సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ను పక్కన పెడితే గత కొంతకాలంగా వెంకటేష్ కు ఒక్క మంచి కథ కూడా దొరకడం లేదని తెలుస్తోంది.తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయాల్సి ఉంది. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో కూడా కూడా వెంకటేష్ ఒక సినిమాని సైన్ చేశారు. కానీ ఇద్దరు డైరెక్టర్లకి కూడా వెంకటేష్ కోసం ఒక మంచి కథ మాత్రం దొరకడం లేదని తెలుస్తోంది.

వీరు కొన్ని కథలను వినిపించినప్పటికీ వెంకటేష్ కు అవి నచ్చటం లేదట. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ కూడా వెంకటేష్ సినిమా కోసం దాదాపు 8 మంది డైరెక్టర్లతో కథలను సిద్ధం చేశారట. కానీ అందులో ఒక డైరెక్టర్ కూడా వెంకటేష్ కు తగ్గ కథను రాయలేకపోయారని తెలుస్తోంది. సురేష్ బాబు కూడా వెంకటేష్ కోసం మంచి కథను వెతికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వెంకీకి నచ్చే కథతో ఏ డైరెక్టర్ ముందుకు వస్తారో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories