యువ హీరోతో "ఐకాన్" సినిమాని తెరకెక్కించనున్న వేణు శ్రీరామ్

Director Venu Sriram Movie With Ram Pothineni | Telugu Online News
x

యువ హీరోతో "ఐకాన్" సినిమాని తెరకెక్కించనున్న వేణు శ్రీరామ్

Highlights

యువ హీరోతో "ఐకాన్" సినిమాని తెరకెక్కించనున్న వేణు శ్రీరామ్

Venu Sriram: ప్రస్తుతం టాలీవుడ్ లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో "ఐకాన్" కూడా ఒకటి. ఎప్పుడో "అల వైకుంఠపురం లో" సినిమా టైంలో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారని ఆ సినిమాకి ఐకాన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన విడుదలయ్యి చాలా కాలమైంది ఇంకా ఈ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. ఈ మధ్యలో వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" సినిమాకి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో అల్లు అర్జున్ మళ్లీ "ఐకాన్" సినిమాని చేయాలని అనుకున్నారు.

కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప: ది రూల్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దీంతో వేణు శ్రీరామ్ ఇప్పుడు ఐకాన్ సినిమాని అల్లు అర్జున్ తో కాకుండా మరో హీరోతో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కథతో యువ హీరో రామ్ పోతినేని సంప్రదించినట్లు తెలుస్తోంది. "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో మంచి హిట్ ను అందుకున్న రామ్ ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ రామ్ "వారియర్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత రామ్ ఐకాన్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories