నాగచైతన్య తో సినిమా ప్లాన్ చేస్తున్న విరాటపర్వం డైరెక్టర్

Director Udugula Venu is Planning a Film with Naga Chaitanya
x

నాగచైతన్య తో సినిమా ప్లాన్ చేస్తున్న విరాటపర్వం డైరెక్టర్

Highlights

నాగచైతన్య తో సినిమా ప్లాన్ చేస్తున్న విరాటపర్వం డైరెక్టర్

Udugula Venu: లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి హిట్లు అందుకున్న అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే విడుదలైన థాంక్యూ మరియు లాల్ సింగ్ చద్దా సినిమాలతో అంతగా మెప్పించలేకపోయారు. తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకున్న అఖిల్ నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్ లో కూడా విడుదల కి సిద్ధమవుతోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం "దూత" అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు నాగచైతన్య.

అయితే తాజా సమాచారం ప్రకారం "విరాటపర్వం" డైరెక్టర్ వేణు ఉడుగుల నాగచైతన్య కి ఒక కథ నెరేట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. "నీది నాది ఒకే కథ" అనే సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఉడుగుల ఈ మధ్యనే రానా మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన "విరాట పర్వం" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక ఈ మధ్యనే అక్కినేని నాగచైతన్యను కలిసిన వేణు ఉడుగుల ఒక మంచి కథను వినిపించారట. నాగచైతన్యకు కథ నచ్చింది కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ నాగచైతన్య సినిమాకి ఓకే చెప్తే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ కూడా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories