Top
logo

సినిమా నచ్చకపోతే తిట్టమంటున్న దర్శకుడు

సినిమా నచ్చకపోతే తిట్టమంటున్న దర్శకుడు
X
Highlights

ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడే దర్శకులలో తేజ పేరు ముందే ఉంటుంది. ఇంటర్వ్యూలో అయినా స్టేజి మీద అయినా...

ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడే దర్శకులలో తేజ పేరు ముందే ఉంటుంది. ఇంటర్వ్యూలో అయినా స్టేజి మీద అయినా నిజాయితీగా మాట్లాడటం, తన తప్పులను ఒప్పుకోవడం వంటివి ఇప్పటికే చాలాసార్లు చేశాడు తేజ. తాజాగా తన తదుపరి సినిమా 'సీత' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తేజ చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. "నేనో గొప్ప సినిమా తీశానని చెప్పను కానీ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఒక మంచి సినిమా తీసేందుకు ప్రయత్నించాను. నేను చేసిన దాన్లో పది శాతం తప్పులు ఉంటే వాటిని మళ్లీ సరి చేశాను." అని చెప్పాడు తేజ.

"సినిమా నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేయండి. సినిమా బాగా లేకపోతే ఇందులో చేసిన తప్పులు తర్వాత సినిమాల్లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. నేను విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు తేజ. "సినిమా నచ్చక పోతే నన్ను తిట్టండి పర్వాలేదు. నా పనితనం బాగాలేకుంటే నేను తిట్లను స్వీకరిస్తాను" అని స్పష్టం చేశాడు. సినిమాలో నటీనటులు మరియు అందరూ టెక్నీషియన్స్ అద్బుతంగా పని చేశారు. నేను మాత్రమే యావరేజ్ గా వర్క్ చేశాను" అని నిర్మొహమాటంగా చెప్పేసాడు.

Next Story