మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్న సుకుమార్

Director Sukumar Film With Chiranjeevi | Tollywood News
x

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్న సుకుమార్ 

Highlights

మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్న సుకుమార్

Chiranjeevi-Sukumar: ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్ కి ఇప్పుడు తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా బోలెడు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాకి రెండవ పార్ట్ అయిన "పుష్ప: ది రూల్" పైన దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్ తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని సుకుమార్ అనుకుంటూ ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త కొత్త సినిమాలను సైన్ చేస్తూ వెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన మరియు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరో వైపు సుకుమార్ విజయ్ దేవరకొండ హీరోగా కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ చిరంజీవి సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories