చిరుని డైరెక్ట్ చేయనున్న సాహో డైరెక్టర్ ?

చిరుని  డైరెక్ట్ చేయనున్న సాహో డైరెక్టర్ ?
x
Sujeeth, chiranjeevi
Highlights

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్నాడు ... ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం కోకాపేటలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్నాడు ... ఇప్పటికే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా ప్రస్తుతం కోకాపేటలో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటుంది.. చిరంజీవిపైన కొన్ని కీలక సన్నివేశాలను కొరటాల చిత్రీకరిస్తున్నారు. ఇది చిరంజీవికి 152వ చిత్రం.. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి 'ఆచార్య' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 153వ చిత్రాన్ని ఎవరు చేయబోతున్నరన్న ఆసక్తి నెలకొంది. చిరు తన 153వ చిత్రాన్ని మ‌లయాళ చిత్రం `లూసిఫ‌ర్‌`ను చిరు రీమేక్ చేయ‌బోతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులను చిరంజీవి కొనేశారు కూడా ... ఈ సినిమాని కూడా కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయనున్నరన్న చర్చ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి.

ఇందులో ముందుగా సుకుమార్ పేరు వినిపించిన వి.వి.వినాయ‌క్ డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని వార్తలు వచ్చాయి. చిరు రీఎంట్రీ మూవీ ఖైది 150 ని వినాయక్ డైరెక్ట్ చేశారు కాబట్టి వినాయక పేరు బలంగా వినిపించింది. కానీ యంగ్ దర్శకులకి ఈ ఛాన్స్ ఇవ్వాలని రామ్ చరణ్ భావిస్తున్నారట! ఈ నేపధ్యంలో సాహో దర్శకుడు సుజీత్ అయితే బాగుంటుందన్న చర్చ నడుస్తుందట! సాహో ప్లాప్ అయినప్పటికి టేకింగ్ పరంగా కొత్తదనం చూపించడంతో సుజిత్ కి చిరుని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపైన క్లారిటీ రావాల్సిఉంది.

శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సుజీత్ తన రెండో చిత్రాన్నే ప్రభాస్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ తో సాహో సినిమాని తెరకెక్కించాడు. సినిమా ప్లాప్ అయినప్పటికీ చాలా బాగా హ్యాండిల్ చేశాడన్న పేరు బాగానే వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories