Top
logo

రాజమౌళిపై కేసులు పెట్టిన హీరోల అభిమానులు !

రాజమౌళిపై కేసులు పెట్టిన హీరోల అభిమానులు !Hit movie Pre Release Function
Highlights

రాజమౌళిపై రాంచరణ్, జూ ఎన్టీఆర్ అభిమానులు కేసులు పెట్టారని, వాటి వివరాలు చెప్పాలని యాంకర్ సుమ హిట్ సినిమా వేడుకలో ప్రశ్నించారు.

'ఫలక్‌నుమాదాస్‌' సినిమా ఫేమ్‌ విశ్వక్‌ సేన్‌, రుహానీ శర్మ జోడిగా తెరకెక్కుతున్న చిత్రం 'హిట్‌'. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. 'హిట్‌' అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశాడు విశ‌్వక్ సేన్. పబ్‌లో మిత్రులతో సరదాగా గడిపిన ప్రీతి అనే యువతి.. మరుసటి రోజు హైవేపై కనిపించింది. అర్ధరాత్రి దాటినా ప్రీతి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ప్రీతి మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇస్తారు. ఈ కేసును విక్రమ్ రుద్రరాజు ఛార్జ్ తీసుకున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 28 ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా శైలేష్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చారు. మురళీ శర్మ, భానుచందర్‌ పలువురు నటినటులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

ఆదివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. దర్శకధీరుడు రాజమౌళి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, టాలీవుడ్ అగ్రకథానాయక అనుష్క, రానాతో సహా పలువురు అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ, దర్శకుడు రాజమౌళి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీపై కేసులు నమోదయ్యాయని రాజమౌళిని సుమ సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగారు.

సుమ : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రశ్నలు సంధించారు. ముగ్గురు కో-డైరెక్టర్‌లు 2 అసిస్టెంట్‌ డైరెక్టర్ల సతీమణులు మీ కేసులు నమోదు చేశారు? సినిమా ఎప్పుడు అవుతుందోనని అడుగుతున్నారు.

రాజమౌళి: కో-డైరెక్టర్ల భార్యలే ఫిర్యాదు చేశారా, హీరోల అభిమానులు ఫిర్యాదు చేయలేదా అని ప్రశ్నించారు.

సుమ: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల ఫ్యాన్స్‌ నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. మా హీరోలు మీ వద్ద ఉన్నారు. ఎప్పుడు రిలీజ్‌ చేస్తారని ఫిర్యాదు చేశారు. రిలీజ్ డేట్ చెప్పగానే కేసు క్లోజ్ చేద్దాం అని అడిగారు.

రాజమౌళి: సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. 2021 జనవరి 8న తేల్చి చెప్పారు

సుమ: ప్రతి సినిమా హిట్‌ చేస్తున్నారని కొందరూ కేసులు పెట్టారు. దీనికి ఫార్ములా ఎంటని అడుగుతున్నారని ప్రశ్నించారు

రాజమౌళి: ఇలాంటి కేసులన్నీ మీరు తీసుకోకూడదు. ఎఫ్‌ఐఆర్‌ చేయకుడదని అన్నారు.

ఇద్దరి మధ్య చిన్న ఆసక్తికర చర్చ నడిచింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు వచ్చిన వారందరికీ నవ్వులు పంచారు.

అనంతరం రాజమౌళి మాట్లాడారు. 'హిట్ సినిమా టీజర్‌, ట్రైలర్‌ అన్నీ బాగా ఉన్నాయి. స్నీక్‌పీక్‌ అనే ఆలోచన బాగా నచ్చింది. సినిమాలో కీలకమైన

సీన్స్ ముందే రిలీజ్ చేయడాన్ని స్నీక్‌పీక్‌ అంటారు. 2012 ఇంగ్లిష్‌ సినిమాలో ఇలా చేశారు. తొలిసారిగా తెలుగులో 'హిట్‌'తో సినిమాలో ఆ ధైర్యం చేశారు. అని చెప్పారు. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని, సినీ బృందాని శుభాకాంక్షలు తెలిపారు.


Web TitleDirector SS Rajamouli Speech at Nani HIT Movie Pre-Release Event
Next Story


లైవ్ టీవి