Shiva Nirvana: "మళ్లీ ప్రేమకథ రాస్తున్నా" అంటున్న శివ నిర్వాణ

Director Shiva Nirvana Said that He Preparing a Love Story for New Movie | Cinema News Today
x

డైరెక్టర్ శివ నిర్వాణ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

Shiva Nirvana: * స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టిన "టక్ జగదీష్" డైరెక్టర్ * ఒక హిట్ సినిమా తీయాలని సంకల్పించుకున్నారట

Shiva Nirvana: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన "నిన్ను కోరి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమయ్యాడు శివ నిర్వాణ. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న శివ నిర్వాణ "మజిలీ" సినిమాతో కూడా ప్రేక్షకుల నుంచి అభినందనలను పొందాడు. కానీ శివ నిర్వాణ మరియు నాని కాంబినేషన్ లో ఈ మధ్యనే విడుదలైన "టక్ జగదీష్" సినిమా మాత్రం అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తామని అన్నప్పుడే అప్పుడే అభిమానులు నిరాశ పడ్డారు. సినిమా కూడా బాగాలేకపోవడంతో అభిమానులు ఈ సినిమా విషయంలో బాగా నిరాశ చెందారు.

కానీ ఈసారి మాత్రం శివ నిర్వాణ ఒక హిట్ సినిమా తీయాలని సంకల్పించుకున్నారట. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం కథలు రాయటం ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపి ఇది ఒక ప్రేమకథ అని, ఎమోషనల్ టచ్ ఉండే ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని చెప్పారు. తనకి వైజాగ్ అన్నా బీచ్ అన్నా చాలా ఇష్టం అని అందుకే "నిన్ను కోరి" మరియు "మజిలీ" సినిమాల కి వైజాగ్ బ్యాక్ డ్రాప్ ఉండేలా చూసుకున్నట్లు కూడా శివ నిర్వాణ తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories