Shiva Nirvana : నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండతోనే అంటున్న దర్శకుడు

Director Shiva Nirvana Clarifies That his Next Movie With Vijay Deverakonda
x

విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ 

Highlights

* తదుపరి సినిమా విజయ్ దేవరకొండతోనే గురించి క్లారిటీ ఇచ్చిన శివ నిర్వాణ

Shiva Nirvana - Vijay Deverakonda: మంచి హిట్ సినిమాలతో ముందుకు దూసుకు పోతున్న దర్శకుడు శివ నిర్వాణ. "నిన్ను కోరి" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ "మజిలీ" సినిమాతో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఇప్పుడు మళ్లీ నాని హీరోగా "టక్ జగదీష్" సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతోంది. తాజాగా శివ నిర్వాణ మరొక సినిమాని లైన్ లో పెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న తదుపరి సినిమాలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరో గా కనిపించనున్నారని తెలుస్తోంది.

తన నెక్స్ట్ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే శివ నిర్వాణ తో సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్తుందట. ఒకవైపు "టక్ జగదీష్" సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు శివ నిర్వాణ. మరోవైపు ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ "లైగర్" సినిమాపైనే పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories