RC-15: మళ్లీ రామ్ చరణ్ సినిమాపై కన్నేసిన శంకర్..

RC-15: మళ్లీ రామ్ చరణ్ సినిమాపై కన్నేసిన శంకర్..

Arun Chilukuri
Updated on: 9 Oct 2022 2:31 PM IST
Director Shankar is Back to RC-15 Sets from Indian-2 Now
X

RC-15: మళ్లీ రామ్ చరణ్ సినిమాపై కన్నేసిన శంకర్..

Ram Charan - Shankar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబో లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడో 2021 సెప్టెంబర్‌లో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్ జే సూర్య, సునీల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే శంకర్ కమల్ హాసన్ తో "ఇండియన్-2" షూటింగ్ కి గతంలో బోలెడు బ్రేకులు పడ్డాయి కానీ ఇప్పుడు మాత్రం షూటింగ్ బాగానే సాగుతోంది. కానీ ఈ క్రమంలో RC-15 షూటింగ్ మాత్రం కొద్ది రోజులు ఆగిపోయింది.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శంకర్ మళ్లీ రామ్ చరణ్ సినిమా ను సెట్స్‌కు తిరిగి తెచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర కొత్త షూటింగ్ షెడ్యూల్ సోమవారం (అక్టోబర్ 10) నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. 6 రోజులలో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుంది అని అంటున్నారు. దీని తర్వాత శంకర్ మళ్లీ "ఇండియన్-2" సినిమా మొదలు పెడతారు. ఇక వీలైనంత త్వరగా సినిమా పనులను పూర్తి చేయాలని శంకర్ ప్రయత్నిస్తున్నారు. మరి ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లను ఎంతవరకు పూర్తి చేస్తారో వేచి చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story