"పుష్ప" ఫ్లవర్ అయితే కాదు అంటున్న "అర్జున్ రెడ్డి" డైరెక్టర్

Director Sandeep Reddy Vanga Shocking Comments on Pushpa Movie
x

"పుష్ప" ఫ్లవర్ అయితే కాదు అంటున్న "అర్జున్ రెడ్డి" డైరెక్టర్

Highlights

* "పుష్ప" పై షాకింగ్ కామెంట్స్ చేసిన "అర్జున్ రెడ్డి" డైరెక్టర్.

Sandeep Reddy Vanga - Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా "పుష్ప: ది రైజ్". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ తన మాస్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒకవైపు సినిమా మిక్స్ రెస్పాన్స్డ్ అందుకున్నప్పటికీ మరోవైపు కలెక్షన్ల పరంగా మాత్రం "పుష్ప" రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాపై సోషల్ మీడియా ద్వారా తమ అబిప్రాయాలను తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో చేరారు సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ హీరోగా "అర్జున్ రెడ్డి" వంటి బ్లాక్ బస్టర్ ప్రేక్షకులకు అందించిన సందీప్ "పుష్ప" గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

"పుష్ప ఒక ఆర్ట్. ఇందులో ఎమోషన్స్ ఎక్కువ. పుష్ప కచ్చితంగా ఒక పువ్వు అయితే కాదు. అది ఒక భయంకరమైన బాంబు" అని అన్నారు సందీప్. అంతేకాకుండా ఈ సినిమాకి వందకి వంద మార్కులు ఇచ్చిన సందీప్ రెడ్డి ఇలాంటి సినిమాని కేవలం ఇతర దర్శకులు మాత్రమే రేట్ చేయగలరని అన్నారు. ఇది ఒక మాస్టర్ పీస్ అని ఈ సినిమా కి రేటింగ్ ఇచ్చే అధికారం ఆడియన్స్ కి కాదు కేవలం దర్శకులకి మాత్రమే ఉందని అన్నారు. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్లో రణబీర్ కపూర్ హీరోగా "యానిమల్", మరియు ప్రభాస్ హీరోగా "స్పిరిట్" సినిమాలతో బిజీగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories