నేను జేబు దొంగ లాగా ఉన్నాను .. వర్మ

నేను జేబు దొంగ లాగా ఉన్నాను .. వర్మ
x
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే .. అది సినిమా అయిన లేకా ట్వీట్ అయిన .. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన...

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషనే .. అది సినిమా అయిన లేకా ట్వీట్ అయిన .. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసుకుంది . ఇందులో భాగంగా వర్మ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఏకంగా మద్యం సీసాను తన తలపై పొసుకున్నారు . అ తర్వాత ఛార్మిని గట్టిగా కౌగిలించుకొని పూరికి ముద్దు పెట్టారు .. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది .. దీనిని వర్మ ట్యాగ్ చేస్తూ నాకు పిచ్చి లేదు . ఇస్మార్ట్ శంకర్ నాకు పిచ్చి పట్టించిందని ట్వీట్ చేసారు .



ఇది ఇలా ఉంటే ఈ సినిమాని చూసేందుకు ఈరోజు మూసాపేటలోని శ్రీరాములు దియేటర్ లోకి వర్మ అజయ్ భూపతి మరియు అగస్త్య లతో కలిసి బైక్ పైన వెళ్లారు .ఈ విషయాన్ని వర్మ పోస్ట్ చేసారు . సినిమా చుసిన అనంతరం వర్మ దియేటర్ లో జరిగిన అనుభవాలను పంచుకుంటూ ఓ వీడియోని పోస్ట్ చేస్తూ ఈ వీడియోలో నేను జేబు దొంగ లాగా ఉన్నాను కదా అని తన మీదా తానే కౌంటర్ వేసుకున్నారు వర్మ ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories