శివ సినిమాలో డైరెక్టర్ పూరి.. అప్పట్లో అలా ఉండేవాడు మరి!

శివ సినిమాలో డైరెక్టర్ పూరి.. అప్పట్లో అలా ఉండేవాడు మరి!
x
puri jagannath (File photo)
Highlights

టాలీవుడ్ కింగ్ నాగర్జున సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా 'శివ'.. అప్పటివరకు ఓ మూసధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాని మరో మలుపు తిప్పింది

టాలీవుడ్ కింగ్ నాగర్జున సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా 'శివ'.. అప్పటివరకు ఓ మూసధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాని మరో మలుపు తిప్పింది ఈ సినిమా.. టాలీవుడ్ ని శివకి ముందు శివ తర్వాత అని చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రయపడుతారు. 1989లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ అనే సెన్సేషన్ దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు..

ఇక అయితే ఈ సినిమాలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుడా ఉన్నాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు.. తాజాగా ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలోని ఓ స్టిల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. " కాలేజీలో నాగార్జున వెనుక పూరి ఉన్న ఫోటోకు 'శివ షూటింగులో నాగార్జున, ఇస్మార్ట్ పూరి" అంటూ పోస్ట్ చేశాడు.. అప్పుడు పూరి చాలా సన్నగా, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో 'బోటనీ పాఠముంది… మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా' అనే సాంగ్ లో చిన్న స్టెప్పులు వేస్తూ పూరి కనిపిస్తారు.



ఇక వర్మ శిష్యుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో ఎదిగాడు పూరి.. పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా తన సినీ జీవితాన్ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, పోకిరి, దేశముదురు సినిమాలతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు.. గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఉగాదికి సినిమాని రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories