మొన్న సిగరెట్.. ఇవాళ మందు ఆర్జీవీ ట్వీట్ వైరల్

మొన్న సిగరెట్.. ఇవాళ మందు ఆర్జీవీ ట్వీట్ వైరల్
x
Ramgopal varma(File photo)
Highlights

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఇటీవల కరోనా పై కసి తీర్చుకున్నాడు.

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఇటీవల కరోనా పై కసి తీర్చుకున్నాడు. దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇస్తే.. రామ్గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో సిగరెట్ వెలిగించి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తాజాగా మరోసారి ఈ వివాదాస్పద దర్శకుడు మద్యంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా జరిగే అనర్ధాలపై ట్వీట్ చేశాడు. ప్రజలు కోరుకునే వాటిని పరిమితులు విధిస్తే వేరే వాళ్లు దాన్ని బ్లాక్ మార్కెట్ చేసే అవకాశాలున్నాయి. దీని వల్ల మందుబాబులు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలకు మనీ ఉపయోగిస్తారు. దాంతో ప్రజలు కుటుంబ అవసరాలను కోల్పోవాల్సి వస్తోందని తన అభిప్రాయం వ్యక్తం చేసాడు.

కరోనా ఉదృతి కారణంగా ప్రభుత్వం దాదాపు నిత్యవసరాలకు మినహాయింపులు ఇంచింది. ఇతర వాటిపై లాక్‌డౌన్ కొనసాగుతుంది. అందులో మద్యం దుకాణాలు కూడా ఉన్నాయి. మద్యం షాపులు మూతపడటంతో తెలుగు రాష్ట్రాలతో ప్రభుత్వాల ఆదాయాలకు గండిపడింది. కేవలం లిక్కర్ ద్వారానే కేంద్రానికి భారీ మొత్తంలో ఆదాయం ఆర్జిస్తోంది. మహారాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను పరిమితులతో కూడిన మద్యం షాపులను తెరవాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ ట్వీట్ల 2019లో రెస్టారెంట్‌లో ప్రజలు భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసాడు. వర్మ ట్వీట్ చేసిన ఈ రెండు ట్వీట్స్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.








Show Full Article
Print Article
Next Story
More Stories