పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న "ఖిలాడి" డైరెక్టర్

Director Ramesh Varma is Planning a Big Budget Movie with Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న "ఖిలాడి" డైరెక్టర్

Highlights

పవన్ కళ్యాణ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్న "ఖిలాడి" డైరెక్టర్

Ramesh Varma: "ఒక ఊరిలో" సినిమాతో దర్శకుడిగా మారిన రమేష్ వర్మ తన కెరియర్లో పెద్దగా హిట్ సినిమాలు ఏవి అందుకోలేదు. మొట్టమొదటిసారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన "రాక్షసుడు" సినిమా తో మంచి హిట్ అందుకున్న రమేష్ వర్మ తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "ఖిలాడి" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి కాకపోయినా ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులని బాగానే అలరించింది. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఇప్పుడు కోనేరు సత్యనారాయణ కి ఒక వంద కోట్ల ప్రాజెక్టు దక్కినట్లు తెలుస్తోంది. ఆసక్తికరంగా రమేష్ వర్మ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోనేరు సత్యనారాయణ తప్పకుండా పవన్ కళ్యాణ్ తో పని చేస్తానని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే "ఖిలాడి" డైరెక్టర్ మరియు నిర్మాత కలిసి పవన్ కళ్యాణ్ తో ఈ భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన మరియు సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరోవైపు డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories