Top
logo

Rakshasudu 2: ప్రేక్షకులను భయపెట్టడానికి మరో రాక్షసుడు వచ్చేస్తున్నాడు

Director Ramesh Varma Announced Rakshasudu-2 Movie With First Look Poster
X

Rakshasudu-2 Movie First Look Poster

Highlights

Rakshasudu 2 Movie: తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'రత్సనన్' తెలుగులో బెల్లంకొం...

Rakshasudu 2 Movie: తమిళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "రత్సనన్" తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో "రాక్షసుడు" గా రీమేక్ చేసి గత కొంత కాలంగా ఫ్లాప్లతో సతమతమవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ చిత్రం మంచి హిట్ ఇచ్చింది. ఆ చిత్రం తర్వాత సీత, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాల్లో నటించిన అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేక చతికిలపడ్డాయి. అయితే తాజాగా రాక్షసుడు చిత్ర దర్శకుడు రమేష్ వర్మ ఆ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. "రాక్షసుడు-2" చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశాడు. ఇప్పటివరకు ఈ చిత్రంలో నటించబోయే నటినటులను ప్రకటించకపోయిన ఒక తెలుగు స్టార్ హీరోను ఎంపిక చేసినట్టుగా అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తుంది.

అయితే తమిళంలో "రత్సనన్"కి దర్శకత్వం వహించిన దర్శకుడు రామ్ కుమార్ విశాల్ విష్ణు హీరోగా "రత్సనన్ -2" చిత్రాన్ని వచ్చే ఏడాది తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలోనే తెలుగులో రమేష్ వర్మ.. శ్రీకాంత్ కోనేరు నిర్మాతగా హవిష్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి రాక్షసుడు చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ మరోసారి రాక్షసుడు-2 చిత్రానికి సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా "రత్సనన్" చిత్రం 75 కోట్లు వసూలు చేయగా, తెలుగులో రాక్షసుడు సినిమా సుమారుగా 25 కోట్ల వరకు వసూళ్ళు సాధించింది. ఇక అతి త్వరలో షూటింగ్ మొదలుపెట్టి మన ముందుకు రాబోతున్న రాక్షసుడు-2 చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు సస్పెన్స్ తో థ్రిల్ చేయనుందో చూడాలి.

Web TitleDirector Ramesh Varma Announced Rakshasudu-2 Movie With First Look Poster - Tollywood News
Next Story