RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ మళ్లీ వాయిదా..!!

Director Rajamouli RRR Movie Release Postponed Again
x

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ మళ్లీ వాయిదా (ట్విట్టర్ ఫోటో)

Highlights

* జనవరిలో ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ అయ్యే అవకాశం..? * మూవీ తేది వాయిదా పడటంతో అభిమానుల నిరుత్సాహం

RRR: ట్రిపుల్‌ ఆర్‌కి వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్‌ ఇప్పుడు విడుదల తేదీని మళ్లీ వాయిదా వేసింది. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రాంచరణ్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహ పడుతున్నారు. కాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఇద్దరు హీరోలు ముసలివాళ్లు అవ్వటం ఖాయం అన్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సినీ ప్రేమికులు.

మరోవైపు తమ సినిమాలు రిలీజ్‌ చేద్దామనుకున్న మిగతా స్టార్స్‌కు ఇది పెద్ద దెబ్బ. దసరాకి ట్రిపుల్‌ ఆర్‌ రిలీజ్‌ అవుతుందని చాలా మంది హీరోలు తమ సినిమాలను జనవరికి వాయిదా వేసుకున్నారు. కానీ సీన్‌ రివర్స్‌ అవ్వడంతో షాక్‌కు గురవుతున్నారు. దసరాకి అయిన రిలీజ్‌ చేద్దామనుకుంటే షూటింగ్స్‌ ఇంకా కంప్లీట్‌ కాలేదని దీంతో ఏం చెయ్యాలో అర్థం కావడంలేదని నిర్మాతలు వాపోతున్నారు.

అటు టాలీవుడ్‌లో కొందరు రాజమౌళి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమా కదా అని దసరాని వదిలేస్తే.. ఇప్పుడు మళ్లీ వాయిదా వేసి తమకు అడ్డుగా వస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా చాలా మంది హీరోలు, నిర్మాతలు మాత్రం రాజమౌళికి రిలీజ్‌‌పై క్లారిటీ లేదని, దీంతో తాము కూడా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories