ప్రభాస్ ఒప్పుకుంటే సీక్వెల్ కి రెడీ అంటున్న డైరెక్టర్

Director Prashant Neil Gave Clarity on Salaar Movie | Tollywood News
x

 ప్రభాస్ ఒప్పుకుంటే సీక్వెల్ కి రెడీ అంటున్న డైరెక్టర్

Highlights

* ప్రభాస్ ఒప్పుకుంటే సీక్వెల్ కి రెడీ అంటున్న డైరెక్టర్

Prashanth Neel: ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ పెద్ద డిజాస్టర్ ను అందుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "సలార్". కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యాక్షన్ పొలిటికల్ ఎంటర్టైనర్గా మాఫియా బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందా అనే విషయంపై రియాక్ట్ అయ్యారు చిత్ర డైరెక్టర్. ప్రభాస్ ఒప్పుకుంటే ఈ సినిమాకి కచ్చితంగా సీక్వెల్ తీసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. కానీ ప్రస్తుతానికి అయితే అలాంటి ఆలోచనలు ఏవీ లేవని అన్నారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సూపర్ హిట్ అయితే అప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories