Nandamuri Mokshagna: వారసుడు వచ్చేశడోచ్‌.. అదరిపోయే రేంజ్‌లో మోక్షజ్ఞ మేకోవర్‌..!

మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా మొదటి సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ లాంచ్‌ చేయనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2024 11:42 AM IST
Director Prasanth Varma Released Balakrishna son Mokshagna First Look on his Birthday
X

Mokshagna: వారసుడు వచ్చేశడోచ్‌.. అదరిపోయే రేంజ్‌లో మోక్షజ్ఞ మేకోవర్‌..!

Nandamuri Mokshagna: నందమూరి నట సింహం, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులతో పాటు.. యావత్‌ సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా మొదటి సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే మోక్షజ్ఞను దర్శకుడు ప్రశాంత్ వర్మ లాంచ్‌ చేయనున్నారు. హనుమాన్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్‌ వర్మకు తన కుమారుడిని లాంచ్‌ చేసే బాధ్యతను అప్పగించారు బాలయ్య. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఫస్ట్‌ లుక్‌ను ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను ఇండస్ట్రీకి పరిచయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. పీవీసీయూ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక తనపై నమ్మంతో ఈ అవకాశం అందించిన బాలకృష్ణకు సైతం ప్రశాంత్‌ వర్మ ధన్యవాదాలు తెలిపారు.

ఇక మోక్షజ్ఞ లుక్‌ విషయానికొస్తే అదిరిపోయేలా ఉంది. సినిమా కోసం మోక్షజ్ఞ తన లుక్‌ను పూర్తిగా మేకోవర్‌ చేశారు. తాను పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకు ముందు ఫొటోల్లో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. పూర్తిగా స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా మేకోవర్‌ అయ్యారు. తొలి సినిమా కోసమే ఇంత కష్టపడ్డ మోక్షజ్ఞ ఇండస్ట్రీలో కచ్చితంగా బాలకృష్ణ లెగసీని ముందుకు తీసుకెళ్లడం ఖాయమని నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇక ప్రశాంత్‌ వర్మ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే ఒక హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోక్షజ్ఞతో తెరకెక్కిస్తోన్న సినిమా కూడా కచ్చితంగా సూపర్‌ నేచురల్‌ నేపథ్యంలో ఉండనుందన్న వార్తలకు బలం చేకూరింది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story