ఆ ఇద్దరు దర్శకుల స్టైల్ లో "సర్కారు వారి పాట" సినిమాని తీసిన పరశురామ్

Director Parasuram followed Koratala Siva and Trivikram Srinivas
x

ఆ ఇద్దరు దర్శకుల స్టైల్ లో "సర్కారు వారి పాట" ఆ సినిమాని తీసిన పరశురామ్

Highlights

* ఆ ఇద్దరు దర్శకుల స్టైల్ లో "సర్కారు వారి పాట" సినిమాని తీసిన పరశురామ్

Parasuram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కార్ వారి పాట" సినిమా ఈనెల 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది. "గీత గోవిందం" సినిమా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ ని కూడా ఇచ్చారు డైరెక్టర్.

గతంలో పరశురాం దర్శకత్వం వహించిన సోలో, సారొచ్చారు, గీతగోవిందం వంటి సినిమాలకి భిన్నంగా "సర్కారు వారి పాట" సినిమా తీశారు పరశురామ్. అయితే సినిమా చూసిన కొందరు మాత్రం పరశురామ్ తన స్టైల్ ను పక్కన పెట్టి కొరటాలశివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి కమర్షియల్ డైరెక్టర్ ల స్టైల్ లో ఈ సినిమాని తీశారు అని అంటున్నారు. కొరటాల శివ కూడా సోషల్ మెసేజ్ ఉండే కథలకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాలు తీస్తారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తీసిన "శ్రీమంతుడు", "భరత్ అనే నేను" సినిమా లు ఈ కోవకే చెందుతాయి. అలాగే డైలాగులతో కామెడీని పండించే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా పరశురామ్ కూడా ఈ సినిమాలో మంచి పంచ్ డైలాగులను పెట్టారు అని, ఇలా డైరెక్టర్ పరశురాం తన స్టైల్ లో కాకుండా వేరే డైరెక్టర్లు స్టైల్ లో ఈ సినిమాను తీశారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories