Viva Harsha Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవా హర్ష

Director Maruthi Shared Viva Harsha Marriage Photo in Social Media
x

వైవా హర్ష - అక్షర వివాహం (ట్విట్టర్ ఫోటో)

Highlights

* సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వైవా హర్ష వివాహం

Viva Harsha Marriage: దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం "వైవా" అనే ఒక యూట్యూబ్ షార్ట్ వీడియోతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించిన చెముడు హర్ష.. ఆ వీడియోతో వైవా హర్షగా మారి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఒక మంచి కమెడియన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే తన స్నేహితురాలైన అక్షర అనే అమ్మాయితో హర్ష ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా గురువారం వైవా హర్ష హైదరాబాద్ లో తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి హాజరైన దర్శకుడు మారుతి.. హర్షకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పెళ్లి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వివాహానికి నటుడు ప్రవీణ్, నిర్మాత ఎస్ కేఎన్ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక వైవా హర్ష పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్షర విషయానికొస్తే ఆమె పూర్తి పేరు అక్షర రీసు.. ఎమ్.కాం పూర్తిచేసిన ఈ అమ్మాయి హర్షతో గత నాలుగేళ్ళుగా ప్రేమలో ఉండగా పెద్దలను ఒప్పించి తాజాగా ఈ జంట మూడుముళ్ళ బంధంతో ఒక్కటైనారు.


Show Full Article
Print Article
Next Story
More Stories