మిడతల దాడి గురించి ఆ సినిమాలో ఎప్పుడో చూపించా

మిడతల దాడి గురించి ఆ సినిమాలో ఎప్పుడో చూపించా
x
KV Anand (file photo)
Highlights

ఉత్తర భారతదేశంలో రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మిడతల దాడి కారణంగా పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు...

ఉత్తర భారతదేశంలో రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మిడతల దాడి కారణంగా పంటలు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మిడతలు పెద్ద సమూహాంగా వచ్చి ఒక్కసారిగా పంటపొలాలపై దాడి చేస్తాయి. మిడతల దాడి 'బందోబస్త్‌' సినిమాతో చూపించారని కె.వి.ఆనంద్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సినిమా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మిడతల దాడి గురించి నాకు చాలామంది మెస్సేజ్‌లు పంపిస్తున్నారని వాళ్లు పంపించిన ఫొటోలు, మెస్సేజ్‌లు చూస్తే నాకెంతో బాధగా అనిపిస్తోందని కె.వి.ఆనంద్‌ అన్నారు. న్యూస్‌పేపర్స్‌, మ్యాగజైన్స్‌లో వచ్చే ఆర్టికల్స్‌, నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకునే ఇప్పటివరకూ సినిమాలు తీశానని చెప్పారు. 'వీడొక్కడే', 'బ్రదర్స్‌' చిత్రాలను అలా రూపొందించినవే అని చెప్పారు.

బ్రదర్స్‌ మూవీ షూటింగ్‌లో తూర్పు ఆఫ్రికా వెళ్లినప్పుడు మిడతల దాడిని ప్రత్యక్షంగా చూశానన్నారు. మిడతలు ఒక్కసారిగా రావడంతో కారును డ్రైవర్‌ 30 నిమిషాలు రోడ్డుపైనే ఆపేశాడు. ఎప్పటినుంచో మిడతల దాడి గురించి ప్రేక్షకులకు తెలియచేయాలనుకున్నా.. ఈ క్రమంలోనే 'బందోబస్త్‌' సినిమా తీశానని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories