Director Harish Shankar: యాక్టర్‌గా డైరెక్టర్ రీ ఎంట్రీ.. ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న హరీష్ శంకర్..

Director Harish Shankar doing a key role in Suhas Movie Oh Bhama Ayyo Rama
x

యాక్టర్‌గా డైరెక్టర్ రీ ఎంట్రీ.. ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న హరీష్ శంకర్..

Highlights

దర్శకుడు హరీష్ శంకర్ తెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్‌లో మాత్రమే కనిపించారు.

Director Harish Shankar: దర్శకుడు హరీష్ శంకర్ తెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్‌లో మాత్రమే కనిపించారు. రవితేజ నటించిన నిప్పు, నేనింతే వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. కానీ తొలిసారి హరీష్ ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా ముందుకు రానున్నారు. కానీ ఈ సారి మాత్రం కాస్త కీలకమైన వేషమే వేస్తున్నారు. సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామ అనే సినిమాలో హరీష్ శంకర్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూట్‌లో ఉంది. ఈ ప్రేమ కథలో మలయాళ నటి మాళవిక మనోజ్ కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నారు. హరీష్ శంకర్ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

లవ్ టుడే తో తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మారారు. ఆ సినిమాలో హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేశారు. లవ్ టుడే తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చేశారు. ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే తనకు కూడా యాక్టింగ్ చేయాలని ఉందనే హింట్ ఇచ్చారు హరీష్ శంకర్. కెమెరా వెనుక ఉన్న దర్శకులు కెమెరా ముందుకు రావాలంటే ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు. తన సినిమాలు కొన్ని డిలే అవుతున్న సమయంలోనే హీరోగా చేద్దామని అనిపించిందని.. అయితే తనకు అంత ధైర్యం లేదన్నారు. ఈ విషయంలో ప్రదీప్ రంగనాథన్ ధైర్యంగా ముందడుగు వేశారన్నారు. అతడికి హాట్సాఫ్ అని హరీష్ శంకర్ చెప్పారు. ఇలా చెప్పిన కొద్ది రోజుల్లోనే హరీష్ శంకర్ కెమెరా ముందుకు వచ్చారు.

ఓ భామ అయ్యో రామ సినిమాలో హరీష్ శంకర్ కీలక పాత్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బుధవారం జరిగిన చిత్రీకరణలో హరీష్ శంకర్ జాయిన్ అయ్యినట్టు సమాచారం. ఆయన పై కీలక సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. దీంతో ఆడియన్స్ ఇప్పుడు అతనికి హాట్సాఫ్ చెప్తున్నారు.

అయితే ఈ సినిమాలో హరీష్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? సినిమాలో ఆయన ఎంతసేపు కనిపిస్తారు..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి అయితే ఆయన నటుడిగా మారారు అనేది కన్ఫార్మ్. గతలో నిప్పు, నేనింతే సినిమాల్లో అతిథి పాత్రలు చేసిన శంకర్.. ఇప్పుడు కాస్త వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు.

ఓ భామ అయ్యో రామ సినిమాను రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఇక హరీష్ శంకర్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్‌ కథానాయకుడిగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories