ఎన్టీఆర్ సినిమాని పక్కన పెట్టనున్న "ఉప్పెన" డైరెక్టర్

*ఎన్టీఆర్ సినిమాని పక్కన పెట్టనున్న "ఉప్పెన" డైరెక్టర్

Rama Rao
Published on: 14 Oct 2022 9:20 AM IST
Director Buchi Babu Sana will Focus on the Next Movie
X

ఎన్టీఆర్ సినిమాని పక్కన పెట్టనున్న "ఉప్పెన" డైరెక్టర్

Buchi Babu Sana: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు "ఉప్పెన" సినిమాతో డైరెక్టర్ గా కూడా మారిపోయారు. వైష్ణప్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సినిమా అయినప్పటికీ "ఉప్పెన" సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక బుచ్చిబాబు తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమాని ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మాత్రం ఇప్పుడే పట్టాలెక్కేలాగా కనిపించడం లేదు.

ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి మరికొన్ని నెలల సమయం ఉంది కాబట్టి ఈ సినిమా సంగతి పక్కన పెట్టి బుచ్చిబాబు ఈ గ్యాప్ లో మరొక సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా కోసం హీరోని కూడా వెతికే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. "ఉప్పెన" సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు బుచ్చిబాబు రెండవ సినిమాని కూడా నిర్మించబోతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story