కమల్ హాసన్ కి మేకప్ ఇన్ఛార్జి గా మారిన డైరెక్టర్...

Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు...

Shireesha
Updated on: 25 May 2022 3:30 PM IST
Director Becomes Kamal Haasan Makeup Incharge for His Movie Vikram | Live News
X

కమల్ హాసన్ కి మేకప్ ఇన్ఛార్జి గా మారిన డైరెక్టర్...

Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి లోకేష్ కనగరాజ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్, ఖైదీ వంటి సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో కమల్ హాసన్ ని ఒక డిఫరెంట్ లుక్ తో చూపించబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి మరియు మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సూర్య ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ లోకేష్ కనకరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను స్వయంగా కమల్ హాసన్ కి మేకప్ వేసినట్లు చెప్పారు లోకేష్. "నాకు ఎప్పటినుంచో కమల్ సర్ కి మేకప్ వేయాలని ఉండేది. ఒకసారి అడగగా ఆయన కూడా ఓకే అన్నారు. ఆ తర్వాత 32 రోజుల పాటు నేనే ఆయన ఆయన మేకప్ ఇంచార్జిని.

ఇప్పటిదాకా ఏ డైరెక్టర్ ని కమల్ సర్ మేకప్ వేసేందుకు ఒప్పుకోలేదు. సర్ కి మేకప్ వేసిన మొట్టమొదటి డైరెక్టర్ నేను అయ్యుండొచ్చు" అని చెప్పుకొచ్చారు లోకేష్. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, వినోద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది.

Shireesha

Shireesha

Next Story