Ajay Bhupathi: విభిన్న జోనర్ సినిమా తో అజయ్ భూపతి సినిమా

* మరి రెండు జోనర్స్ కలిపిన ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

R Tripura Malini
Published on: 19 Nov 2022 10:55 AM IST
director ajay bhupati to try a different genre for his new film
X

విభిన్న జోనర్ సినిమా తో అజయ్ భూపతి సినిమా

Ajay Bhupathi: "ఆర్ ఎక్స్ 100" దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. కార్తికేయ గుమ్మకొండ మరియు పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 50 రోజులు ఆడడమే కాకుండా నటీనటులకు మాత్రమే కాక సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్ లకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత చిత్ర డైరెక్టర్ కు చాలా పెద్ద ఆఫర్‌లు వచ్చాయి కానీ అజయ్ మాత్రం శర్వానంద్ మరియు సిద్ధార్థ్‌లతో "మహా సముద్రం" చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోల్డ్ స్టేట్‌మెంట్ తో విడుదలైన ఈ చిత్రం కనీసం బ్రేక్‌ఈవెన్ ను కూడా రికవరీ చేయలేకపోయింది.

ఇక సినిమా గురించి విడుదలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన పై తీవ్ర విమర్శలు కూడా మొదలయ్యాయి. దాదాపు ఏడాది విరామం తర్వాత, అజయ్ కొత్త ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజా సమాచారం ప్రకారం, అజయ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే "మంగళవారం" అనే ఒక ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసారు. ఈ సినిమాలో హారర్ మరియు కామెడీ కూడా ఉంటుందని సమాచారం. అజయ్ చేసిన చిత్రాలలో ఇప్పటిదాకా హారర్ కానీ కామెడీ ఎలిమెంట్స్ కానీ లేవు. మరి రెండు కలిపిన ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story