బాలయ్యతో సినిమా ఆఫర్ని రిజెక్ట్ చేసిన డింపుల్ హయాతి

Dimple Hayathi rejects movie offer with Balakrishna
x

బాలయ్యతో సినిమా ఆఫర్ని రిజెక్ట్ చేసిన డింపుల్ హయాతి

Highlights

*బాలయ్యతో సినిమా ఆఫర్ని రిజెక్ట్ చేసిన డింపుల్ హయాతి

Dimple Hayathi: ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు తన తదుపరి సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. #ఎన్బీకే107 అని పిలవబడుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హనీ రోజ్ వర్గీస్ రెండో హీరోయిన్ పాత్రలో బాలయ్యతో రొమాన్స్ చేయబోతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి ని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడిగారట. ఈ మధ్యనే "ఖిలాడీ" సినిమాలో కనిపించిన డింపుల్ ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మూడు నుంచి నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ సరసన ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా కనిపించబోతోంది డింపుల్.

ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ కోసం అడగగా డింపుల్ హయాతి ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో ఇప్పుడు ఒక ఆస్ట్రేలియన్ ఇండియన్ మోడల్ చంద్రికా రవి ని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories