RC 15: ఒక్క పాట కోసం 8 కోట్లు పెట్టనున్న దిల్ రాజు..

Shankar: దిల్ రాజు సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకున్నట్లే వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 23 Oct 2022 7:38 PM IST
Dil Raju will spend 8 crores for a single song
X

ఒక్క పాట కోసం 8 కోట్లు పెట్టనున్న దిల్ రాజు

Dil Raju: ఈమధ్య కాలంలో స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలన్నీ బడ్జెట్ కి మించి ఖర్చు అవుతున్నాయని వివాదాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో "భారతీయుడు 2" సినిమా విషయంలో కూడా అదే జరిగింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవడంతో సినిమాని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వారు సినిమాని ఆపేసినట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ లైకా ప్రొడక్షన్స్ ముందుకు వచ్చి సినిమాని నిర్మించడానికి ఒప్పుకుంది.

తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. గతంలో ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సినిమాని నిర్మిస్తున్న దిల్ రాజు సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకున్నట్లే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక పాట షూటింగ్ కోసం దాదాపు 8 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కీయారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తూనే మరోవైపు శంకర్ "భారతీయుడు 2" సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story