విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ ఓకే చేయనున్న దిల్ రాజు

Dil Raju will okay the Script for Vijay Deverakonda | Tollywood News
x

విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ ఓకే చేయనున్న దిల్ రాజు 

Highlights

విజయ్ దేవరకొండ కోసం స్క్రిప్ట్ ఓకే చేయనున్న దిల్ రాజు

Dil Raju: గత కొంతకాలంగా యువ హీరో విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలతోనే డిజాస్టర్లు అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాధ దర్శకత్వంలో నటించిన "లైగర్" సినిమాతో మరొక డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక తన స్క్రిప్ట్ సెలక్షన్ బాగుండటం లేదు అని అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ లాక్ చేసే పని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల్లో పెట్టేసారట. ఈ మధ్యనే దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కోసం దిల్ రాజు ఒక మంచి కథను వెతికే పనిలో పడ్డారట. ఇప్పటికే హరీష్ శంకర్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి లీడింగ్ డైరెక్టర్లు విజయ్ దేవరకొండ కోసం కొన్ని కథలు చెప్పారు కానీ ఇంకా ఏది ఓకే అవలేదు. దిల్ రాజు కథ విని ఓకే చెప్పిన తరువాత మాత్రమే ఆ కథ విజయ్ దేవరకొండ వరకు వెళుతుందట. మరి ఈసారైనా దిల్ రాజు విజయ్ దేవరకొండ కి ఒక మర్చిపోలేని హిట్ అందిస్తారో లేదో వేచి చూడాలి. ఇలా ఒకదాని తర్వాత మరొక సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories