ఆ సినిమా ఫేక్ కలెక్షన్స్‌పై నిర్మాత దిల్ రాజు వ్యాఖ్య‌లు వైర‌ల్‌...

Dil Raju Telling that RRR Collections are Fake | Tollywood Gossips
x

ఆ సినిమా ఫేక్ కలెక్షన్స్‌పై నిర్మాత దిల్ రాజు వ్యాఖ్య‌లు వైర‌ల్‌...

Highlights

Dil Raju - RRR Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో...

Dil Raju - RRR Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "ఆర్ఆర్ఆర్". విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ సంపాదించిన ఈ సినిమా చాలావరకు బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ఈ సినిమా నైజాం రైట్స్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొనుగోలు చేశారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఆర్ఆర్ఆర్" కలెక్షన్స్ పై దిల్ రాజు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. "ఆర్ఆర్ఆర్" కలెక్షన్ల గురించి ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఎందుకు అంకెలను విడుదల చేయటం లేదు అని అడగగా దిల్ రాజు షాకింగ్ జవాబు ఇచ్చారు. "అది డిస్ట్రిబ్యూటర్లు చేతిలో ఉండదు. ప్రొడ్యూసర్ల చేతిలో ఉంటుంది. మాకు వచ్చిన కలెక్షన్ల ఫిగర్ మేము నిర్మాతల కి ఫార్వర్డ్ చేస్తాము.

వాళ్లు ఏది చెప్తే అది మాత్రమే జనాల్లోకి వెళ్ళుతుంది. జనాలు అదే నమ్ముతారు" అని చెప్పిన దిల్ రాజు నిజానికి వాళ్లకి వచ్చిన కలెక్షన్లు ఒకటి కానీ నిర్మాతలు ప్రకటించిన కలెక్షన్లు మరొకటి అన్ని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" కలెక్షన్లు ఫేక్ అని దిల్ రాజు ఉద్దేశమా అని అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories