logo
సినిమా

Dil Raju: అందుకే పూజ హెగ్డే ను రంగంలోకి దింపిన దిల్ రాజు...

Dil Raju Selected Pooja Hegde for F3 Item Song Because of Deal | Tollywood News Today
X

Dil Raju: అందుకే పూజ హెగ్డే ను రంగంలోకి దింపిన దిల్ రాజు...

Highlights

Dil Raju: ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలలో కూడా ఐటెం సాంగుల అవసరం మరి అంతా కనిపించటంలేదు...

Dil Raju: ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలలో కూడా ఐటెం సాంగుల అవసరం మరి అంతా కనిపించటంలేదు. "పుష్ప" వంటి సినిమాల్లో ఐటెం సాంగులు బాగానే హిట్ అయినప్పటికీ "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్: చాప్టర్ 2" వంటి సినిమాలలో ఐటెం సాంగులు లేవు కానీ బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం తన సినిమాలలో ఐటెం సాంగు ఉండేలా చూసుకుంటున్నారు.

తన తదుపరి సినిమా "ఎఫ్ 3" లో కూడా ఒక ఐటమ్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ని రంగంలోకి దింపుతున్న ట్లుగా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన "ఊ ఆ ఆహా ఆహా" పాటలో తమన్నా మరియు మెహరీన్ తమ అందాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

మరోవైపు బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో బికినీ అవతారం లో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా కోసం ముందుగానే దిల్ రాజు పూజా హెగ్డే కి అడ్వాన్స్ ఇచ్చేశారని అందుకే హీరోయిన్ గా కాకుండా ఓ ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డే ను సిద్ధం చేసి డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

Web TitleDil Raju Selected Pooja Hegde for F3 Item Song Because of Deal | Tollywood News Today
Next Story