ఆర్ఆర్ఆర్ సినిమా కోసం త్యాగం చేస్తాను అంటున్న దిల్ రాజు

Dil Raju says he will sacrifice for RRR movie
x

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం త్యాగం చేస్తాను అంటున్న దిల్ రాజు 

Highlights

Dil Raju: ఈ మధ్యన తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన "రౌడీ బాయ్స్" సినిమాతో మంచి హిట్ అందుకున్న దిల్ రాజు, తాజాగా ఈ సినిమా విడుదల తేదీల గురించి మాట్లాడారు.

Dil Raju: ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన "ఆర్ఆర్ఆర్" సినిమా మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ రెండు తేదీలలో ఏ తేదీ ని ఖరారు చేస్తారు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన సినిమా విడుదల చేద్దామనుకున్న రోజు "ఆర్ ఆర్ ఆర్" సినిమా విడుదల అవుతుందంటే తన సినిమాని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ మధ్యన తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన "రౌడీ బాయ్స్" సినిమాతో మంచి హిట్ అందుకున్న దిల్ రాజు తాజాగా ఈ సినిమా విడుదల తేదీల గురించి మాట్లాడారు. అందులో భాగంగా "ఆర్ఆర్ఆర్ ప్యాన్ ఇండియన్ సినిమా. అలాంటి సినిమాకి అన్ని విధాలుగా గౌరవం దక్కాలి. ఇంతకు ముందు "ఎఫ్ 3" సినిమాని ఏప్రిల్ 28న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నాము. కానీ ఒకవేళ మార్చి 18న ఆర్ఆర్ఆర్ విడుదల ఏప్రిల్ 28 కి వాయిదా పడితే మా సినిమాని వాయిదా వేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా నేను సంతోషంగా ఫీల్ అవుతాను" అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

Show Full Article
Print Article
Next Story
More Stories