విజయ్ దేవరకొండ కోసం డైరెక్టర్ ను వెతుకుతున్న దిల్ రాజు

Dil Raju is Looking for a Director for Vijay Deverakonda
x

విజయ్ దేవరకొండ కోసం డైరెక్టర్ ను వెతుకుతున్న దిల్ రాజు

Highlights

Tollywood: దిల్ రాజు క్యాంప్ లో చేరిన విజయ్ దేవరకొండ

Tollywood: అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కెరియర్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "లైగర్" సినిమా మరొక పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలబడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా "ఖుషి" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి శివానిర్వాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలైంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

మరొక వారంలో సమంత కూడా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతోంది. అయితే మరోవైపు "అర్జున్ రెడ్డి" సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండ కి అడ్వాన్స్ ఇచ్చేశారు. కానీ ఇప్పటిదాకా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు విజయ్ దేవరకొండ కోసం ఒక మంచి డైరెక్టర్ను వెతికే పనిలో పడ్డారట. ఎవరైతే విజయ్ దేవరకొండకు సెట్ అయ్యే మంచి కథను చెప్తారు వాళ్ళతో ఆ సినిమా నిర్మించడానికి దిల్ రాజు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories