Tollywood: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మొదట ఎవరినీ అనుకున్నారో తెలుసా.?

Did You Know Nagarjuna Was the First Choice for Seethamma Vakitlo Sirimalle Chettu
x

Tollywood: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో మొదట ఎవరినీ అనుకున్నారో తెలుసా.?

Highlights

Seethamma Vakitlo Sirimalle Chettu: టాలీవుడ్‌లో బెస్ట్‌ మల్టీస్టారర్‌ సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి.

Seethamma Vakitlo Sirimalle Chettu: టాలీవుడ్‌లో బెస్ట్‌ మల్టీస్టారర్‌ సినిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఒకటి. 2013 సంక్రాంతికి విడుదలై హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఈ నెల 7న మళ్లీ రీ రిలీజ్‌ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ మరోసారి ఈ సినిమాకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ కథ ఆలోచన మొదటిగా నాగార్జునకు వినిపించానని తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్టాడుతూ..'ఒకసారి నా ఊరికి వెళుతుంటే ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌ ఫోన్‌ చేసి ‘నాగార్జున గారితో సినిమా చేయాలనుకుంటున్నాం. మీ వద్ద కథ ఏదైనా ఉందా?’ అని అడిగారు. అప్పటివరకు నేను కేవలం ఒక సినిమా (కొత్త బంగారులోకం) మాత్రమే చేశాను. అందులో యంగ్‌ హీరో నటించాడు. నాగార్జున సర్‌కి కథ చెప్పాల్సి రావడంతో కొంచెం టెన్షన్‌ అయ్యా. అయినా ‘ఓకే సర్‌.. త్వరలో చెబుతా’ అని చెప్పేశా' అన్నారు.

హైదరాబాద్‌ తిరిగొచ్చిన తర్వాత నాగార్జున గారిని కలిసి. ‘మల్టీస్టారర్‌ సినిమా చేయాలని ఉంది సర్‌.. కథ పూర్తి కాదు కానీ ఓ ఐడియా ఉంది’ అని చెప్పారంటా. దీనికి నాగ్ చూద్దాం అని సమాధానం ఇచ్చారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

అయితే అదే సమయంలో మళ్లీ మార్తాండ్‌ ఫోన్‌ చేసి ‘నిర్మాత సురేశ్‌బాబు కలవాలంటున్నారు’ అన్నాడని చెప్పారు. వెళ్లగానే అక్కడ సురేశ్‌ బాబుతో పాటు వెంకటేష్‌ కూడా ఉన్నారు. దీంతో వారికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథను వివరించాడంటా ఆ పాయింట్ నచ్చడంతో కథ పూర్తి చేయమన్నారని, అలా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్‌ వచ్చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories