"సలార్" సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్న డైలాగ్ రైటర్

Dialogue Writer Hanuman Chowdhury Talks About the Salaar  Movie
x

"సలార్" సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్న డైలాగ్ రైటర్

Highlights

*"సలార్" సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్న డైలాగ్ రైటర్

Salaar: ఈ మధ్యనే "రాధేశ్యామ్" సినిమాతో దశాబ్ద కాలంలో తన కరియర్ లోని మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్న ప్రభాస్ "సలార్" తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "కే జి ఎఫ్: చాప్టర్ 2" తో తాజాగా మరొక బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యాక్షన్ ఎంటర్టైనర్‌గా మాఫియా బ్యాక్ డ్రాప్ తో సాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ప్రిత్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పని చేసిన హనుమాన్ చౌదరి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అభిమానులు 100% ఎక్స్పెక్ట్ చేస్తే "సలార్" సినిమా 200 నుంచి 300 % లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ అభిమానులు అందరూ కాలర్ ఎగరేసుకునే సినిమా అవుతుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు" అని సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు హనుమాన్ చౌదరి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయిందని తెలిసిన విషయమే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మే మొదటి వారం నుంచి పట్టా లెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories